అక్టోబర్‌ 2న డ్రై డే..మద్యం, మాంసం షాపులు బంద్‌

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం అమల్లోకి రానుంది. వైన్‌ షాపులు, బార్లు, పబ్‌లతో పాటు చికెన్‌, మటన్‌, బీఫ్‌ విక్రయ దుకాణాలు, జంతువధశాలలను మూసివేయాలని GHMC ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

1 అక్టోబర్, 2026 1:05 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అక్టోబర్‌ 2న డ్రై డే..మద్యం, మాంసం షాపులు బంద్‌

హైదరాబాద్, అక్టోబర్ 1 (జనవాణి): మద్యం, మాంసం ప్రియులకు అక్టోబర్‌ 2న బ్యాడ్‌ న్యూస్‌. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో మాంసం విక్రయాలు, జంతువధపై నిషేధం అమల్లోకి రానుంది. నగరంలోని అన్ని రకాల జంతువధశాలలు, చికెన్‌, మటన్‌, బీఫ్‌ విక్రయ దుకాణాలను మూసివేయాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

గాంధీజీ అహింసా సిద్ధాంతాలను గౌరవిస్తూ GHMC స్టాండింగ్‌ కమిటీ చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. GHMC చట్టం–1955లోని సెక్షన్‌ 533(బి) కింద ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మేకలు, గొర్రెలు, పశువుల వధశాలలతో పాటు నగరంలోని రిటైల్‌ చికెన్‌, మటన్‌, బీఫ్‌ దుకాణాలు కూడా మూసివేయాల్సి ఉంటుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని మున్సిపల్‌ అధికారులను GHMC కమిషనర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్లకు కూడా లేఖలు పంపి అవసరమైన పోలీసు సహకారం అందించాలని కోరారు. అక్టోబర్‌ 2న నిషేధాన్ని ఉల్లంఘించి మాంసం విక్రయించినా, జంతువధకు పాల్పడినా నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మద్యం విక్రయాలపైనా నిషేధం

మరోవైపు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న దేశవ్యాప్తంగా డ్రై డే అమల్లో ఉంటుంది. దీంతో వైన్‌ షాపులతో పాటు బార్లు, పబ్‌లు, స్టార్‌ హోటళ్లు, మద్యం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల్లోనూ మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వ చేసినా ఎక్సైజ్‌ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే లైసెన్స్‌దారులపై లైసెన్స్‌ రద్దు వంటి చర్యలు కూడా తీసుకోనున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు