ఉరేసుకుని కానిస్టేబుల్ మృతి.. చనిపోయే ముందు యువతికి వీడియో కాల్

హైదరాబాద్‌ మలక్‌పేట్‌లో పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. మృతికి ముందు ఓ యువతికి వీడియో కాల్ చేసి తాను ఉరేసుకుంటున్నట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

21 సెప్టెంబర్, 2026 1:40 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఉరేసుకుని కానిస్టేబుల్ మృతి.. చనిపోయే ముందు యువతికి వీడియో కాల్

హైదరాబాద్,సెప్టెంబర్ 21 (జనవాణి): హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. మూసారాంబాగ్‌లోని శాలివాహన నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందాడు.

చంద్రశేఖర్ చనిపోయే ముందు అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసినట్లు తెలుస్తోంది. తాను ఉరేసుకుంటున్నట్లు ఆమెకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆందోళనకు గురైన యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించింది.

చైతన్యపురి పోలీసులు ఈ విషయాన్ని మలక్‌పేట్ పోలీసులకు తెలియజేయడంతో వారు వెంటనే చంద్రశేఖర్ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే చంద్రశేఖర్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మలక్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్ మృతికి అసలు కారణం ఏమిటనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడు అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు