ఓల్డ్‌సిటీలో షాదాబ్ హోటల్ సీజ్..మరో 19 ప్రాంతాల్లో టీజీ సేఫ్‌ తనిఖీలు

హైదరాబాద్ ఓల్డ్‌సిటీ మదీనాలోని ప్రముఖ షాదాబ్ కేఫ్‌పై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్య లోపాలు, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం నిల్వ చేయడం, కిచెన్‌లో బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరిస్తుండటాన్ని గుర్తించిన అధికారులు FSSAI లైసెన్స్‌ను రద్దు చేసి కేఫ్‌ను సీజ్ చేశారు.

3 సెప్టెంబర్, 2026 11:46 AM•ByNarender Kumar Nangunoori

Share this article

ఓల్డ్‌సిటీలో షాదాబ్ హోటల్  సీజ్..మరో 19 ప్రాంతాల్లో టీజీ సేఫ్‌ తనిఖీలు

హైదరాబాద్, సెప్టెంబర్ 03 (జనవాణి): హైదరాబాద్‌లోని కేఫ్‌లు, స్నాక్ పాయింట్లపై TG SAFE ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విస్తృత తనిఖీలు చేపట్టింది. ఆహార భద్రతాధికారులు, పోలీసులతో కలిసి 9 ప్రత్యేక బృందాలు మొత్తం 19 కేఫ్‌లలో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ఓల్డ్‌సిటీ మదీనాలోని ప్రముఖ షాదాబ్ కేఫ్‌లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడ్డాయి. చికెన్, మటన్ వంటి మాంసం ఉత్పత్తులను నిబంధనలకు విరుద్ధంగా అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరిస్తుండటంతో పాటు పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకపోవడాన్ని గుర్తించారు. దీంతో అధికారులు షాదాబ్ కేఫ్‌కు సంబంధించిన FSSAI లైసెన్స్‌ను రద్దు చేసి, హోటల్‌ను సీజ్ చేశారు. తక్షణమే వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఇదే తనిఖీల్లో లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న డ్రీమ్స్ కేఫ్ (బాగ్‌లింగంపల్లి), ఆసియాటిక్ కేఫ్ (పంజాగుట్ట)లను కూడా అధికారులు మూసివేశారు.

అదేవిధంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన కేఫ్ పర్షయా, బాహర్ బిర్యాని కేఫ్, కేఫ్ డెక్కన్, హనీమూన్ కేఫ్, రియో రెస్టారెంట్, ఆరోమెల్ హాస్పిటాలిటీ, ఫ్రెండ్స్ అండ్ కేఫ్, డైమండ్ పాయింట్ హోటల్, హోటల్ ఉమ్రోజ్, బ్లూసీ టీ అండ్ స్నాక్స్, నిమ్రా కేఫ్ అండ్ బేకరీ, గుల్జార్ ఫుడ్స్కు అధికారులు షోకాజ్ నోటీసులు, ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, పారిశుద్ధ్యం, నిల్వ విధానాలు, లైసెన్సుల విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని TG SAFE అధికారులు స్పష్టం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు