ఆర్టీసీ బస్సు చోరీ.. సినీ ఫక్కీలో చేజింగ్ తర్వాత అరెస్ట్

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సును చోరీ చేసి నిర్లక్ష్యంగా నడుపుతూ పలువురు వాహనదారులను ఢీకొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

23 జులై, 2026 3:49 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఆర్టీసీ బస్సు చోరీ.. సినీ ఫక్కీలో చేజింగ్ తర్వాత అరెస్ట్

జగిత్యాల (తెలంగాణ), జూలై 22: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆర్టీసీ బస్సును చోరీ చేసి వేగంగా నడుపుతూ పలువురు ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన కందుల సాంబయ్య (39) ఈ నెల 22న కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన TS-08-Z-0103 నంబర్ గల ఆర్టీసీ బస్సును చోరీ చేసి నిజామాబాద్ వైపు తీసుకెళ్లాడు.

మార్గమధ్యంలో బస్సును నిర్లక్ష్యంగా నడుపుతూ పలువురు ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టాడు. బస్సును ఆపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను కూడా పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్లాడు. అనంతరం పోలీసులు రోడ్డుపై ఏర్పాటు చేసిన అడ్డంకులను గమనించిన నిందితుడు బస్సును రోడ్డు పక్కన నిలిపివేయగా, అప్రమత్తంగా ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు