జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి కూడా ట్రాన్స్‌జెండర్లను భద్రతా విధుల్లో భాగస్వాములను చేశారు. మొత్తం 17 మంది ట్రాన్స్‌జెండర్లు పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తూ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించారు.
గురుపూర్ణిమ సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని అంజన్నను ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందించే కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఆస్పత్రి భవనం నిర్మాణంతో పాటు జగిత్యాల మెడికల్ కాలేజీలో అన్ని కీలక పీజీ విభాగాలను ప్రారంభించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్‌కు వెంటనే దరఖాస్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సును చోరీ చేసి నిర్లక్ష్యంగా నడుపుతూ పలువురు వాహనదారులను ఢీకొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.