‘అరైవ్‌ అలైవ్‌’పై విద్యార్థులకు అవగాహన.. ట్రాఫిక్‌ నిబంధనలపై వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో సదస్సు

రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు.

8 ఆగస్టు, 2026 6:24 PM•ByRalin

Share this article

‘అరైవ్‌ అలైవ్‌’పై విద్యార్థులకు అవగాహన.. ట్రాఫిక్‌ నిబంధనలపై వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో సదస్సు

వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన అరైవ్ అలైవ్ సదస్సులో ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు, అధ్యాపకులు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనవాణి): రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు. శనివారం ఇబ్రహీంబాగ్‌లోని వాసవి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో బేగంపేట ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టీటీఐ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 800 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్‌ డీసీపీ (ట్రాఫిక్‌) సి.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. తమ భద్రతతో పాటు తోటి ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌ విధానాన్ని విద్యార్థులకు వివరించారు. రోడ్డుపై ఎదురయ్యే ప్రమాదాలను ముందుగానే ఊహించి అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రమాదం జరిగిన తొలి 60 నిమిషాలను ‘గోల్డెన్‌ అవర్‌’గా పేర్కొంటారని, ఈ సమయంలో బాధితుడికి వైద్యం అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి సహాయం చేసే వారికి ప్రభుత్వం ‘రాహ్‌-వీర్‌’ (గుడ్‌ సమారిటన్‌) పథకం కింద రూ.25 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందిస్తుందని తెలిపారు.

హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ తప్పనిసరి

బేగంపేట టీటీఐ ఇన్‌స్పెక్టర్‌ నాగుల అశోక్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లలో సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపవద్దని తెలిపారు.

ట్రాఫిక్‌ సిగ్నళ్లను పాటించడం, వాహనాల మధ్య సురక్షిత దూరం ఉంచడం, ఇండికేటర్లు వినియోగించడం, రోడ్డు సంకేతాలను గమనించడం, వాహనాలను మంచి కండిషన్‌లో ఉంచుకోవడం వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.వి.రమణ, హెచ్‌అండ్‌ఎస్‌ఎస్‌ విభాగాధిపతి డాక్టర్‌ జి.మీనా, టీటీఐ సిబ్బంది కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు