
సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంకెన్ డ్రైవ్.. 292 మందిపై కేసులు
వీకెండ్ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ప్రత్యేకంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 292 మంది పట్టుబడ్డారు.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Hyderabad Traffic Police.

వీకెండ్ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ప్రత్యేకంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 292 మంది పట్టుబడ్డారు.

ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.

వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ మండపాలకు జియో ట్యాగింగ్, ప్రధాన నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక, సోషల్ మీడియాలో వదంతులపై 24 గంటల నిఘా వంటి చర్యలకు సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. మార్పులపై ట్రాఫిక్ పోలీసులు వాకర్లతో ముఖాముఖి నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించారు.

సైబరాబాద్‌లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 311 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 238 మంది ద్విచక్ర వాహనదారులు, 56 మంది కార్ల డ్రైవర్లు ఉన్నారు.

హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. లాల్ దర్వాజా, అంబర్‌పేట్ మహంకాళి ఆలయం, దర్బార్ మైసమ్మ, కార్వాన్ బోనాల సందర్భంగా ఆది, సోమవారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లో ఉంటాయని తెలిపారు.

రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు.