రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగింపు.. హనుమకొండలో కాంట్రాక్ట్ కండక్టర్ల నిరసన

హనుమకొండలో ఆర్టీసీ కాంట్రాక్ట్ కండక్టర్లు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వరంగల్ రీజియన్‌లో పనిచేస్తున్న సుమారు 90 మంది కండక్టర్లను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. వెంటనే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

22 ఆగస్టు, 2026 3:54 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగింపు.. హనుమకొండలో కాంట్రాక్ట్ కండక్టర్ల నిరసన

janavaani Image

హనుమకొండ, ఆగస్టు 22 (జనవాణి): వరంగల్ రీజియన్ ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు 90 మంది కాంట్రాక్ట్ కండక్టర్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బాధిత కండక్టర్లు శనివారం హనుమకొండలోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

గత ఏడాది కాలంగా తమతో విధులు చేయించుకుని, అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని కాంట్రాక్ట్ కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ నిర్వహించిన పలు కీలక కార్యక్రమాలతో పాటు మేడారం మహాజాతరను విజయవంతం చేయడంలోనూ తమ సేవలు కీలకంగా ఉన్నాయని తెలిపారు. ఏడాది పాటు తమ సేవలను వినియోగించుకున్న తర్వాత ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడంతో తమ కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని వాపోయారు. తమను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు