Operation Muskaan | ఆపరేషన్ ముస్కాన్–XIIలో 125 మంది చిన్నారుల రక్షణ.. 54 కేసులు నమోదు

వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, భిక్షాటన, విద్యకు దూరమైన చిన్నారులను గుర్తించి రక్షించే లక్ష్యంతో జిల్లా పోలీసులు వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

1 ఆగస్టు, 2026 12:21 PM•ByRalin

Share this article

Operation Muskaan | ఆపరేషన్ ముస్కాన్–XIIలో 125 మంది చిన్నారుల రక్షణ.. 54 కేసులు నమోదు

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

Operation Muskaan |వికారాబాద్, ఆగస్టు 1: వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, భిక్షాటన, విద్యకు దూరమైన చిన్నారులను గుర్తించి రక్షించే లక్ష్యంతో జిల్లా పోలీసులు వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

జూలై 1వ తేదీ నుంచి జూలై 31 వరకు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 125 మంది చిన్నారులను రక్షించినట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో 116 మంది బాలురు, 9 మంది బాలికలు ఉన్నారని పేర్కొన్నారు. రక్షించబడిన చిన్నారుల్లో 97 మంది బాల కార్మికులు, 26 మంది చదువు మానేసిన (డ్రాప్‌ఔట్) చిన్నారులు, ఒకరు భిక్షాటనలో ఉన్న చిన్నారి కాగా, ఒక బాల్య వివాహాన్ని అడ్డుకుని సంబంధిత చిన్నారిని రక్షించినట్లు వివరించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 41 మంది చిన్నారులను కూడా గుర్తించి రక్షించినట్లు తెలిపారు.

54 కేసులు నమోదు

ఆపరేషన్ ముస్కాన్–XIIలో భాగంగా బాల కార్మికత్వం, బాలల హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి 54 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. రక్షించిన చిన్నారుల్లో 89 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించగా, 36 మందిని బాలల సంరక్షణ గృహాలకు తరలించినట్లు తెలిపారు.

సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి

బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, చిన్నారుల అక్రమ రవాణా, భిక్షాటన వంటి ఘటనలపై జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రమాదంలో ఉన్న చిన్నారులు లేదా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు లేదా డయల్–100, చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

జిల్లాలో ప్రతి చిన్నారికి సురక్షితమైన, విద్యతో కూడిన భవిష్యత్తు కల్పించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్‌ను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు