అన్నం పెట్టిన వాళ్లను మరిచిపోతే పుట్టగతులుండవు: పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మద్దతు ఇచ్చానని తెలిపారు.

13 ఆగస్టు, 2026 8:57 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అన్నం పెట్టిన వాళ్లను మరిచిపోతే పుట్టగతులుండవు: పోచారం శ్రీనివాసరెడ్డి

కామారెడ్డి, ఆగస్టు 13 (జనవాణి): బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామంలో గురువారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం, రహస్యం లేదని పోచారం తెలిపారు. తనకు స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని కొందరు బుద్ధిహీనులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

నేను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నాకు ఎలాంటి స్వార్థం లేదు. ప్రజల కోసమే నా జీవితం అని పోచారం స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మద్దతు ఇచ్చానని తెలిపారు. అన్నం పెట్టిన వాళ్లను మరిచిపోతే పుట్టగతులుండవన్నారు. కేసీఆర్ చేశారు కాబట్టే చేశారని చెప్పానని, ఉన్నది ఉన్నట్లు చెప్పడం తన నైజమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి కూడా అదే విధంగా చెబుతానన్నారు. తాను పోరాటం చేస్తానని, కానీ తలవంచే రాజకీయాలు చేయబోనని స్పష్టం చేశారు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే ఏమైనా చేస్తానన్నారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని పోచారం తెలిపారు. ప్రభుత్వం సహకరించకపోతే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు