'వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడి ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

తన తండ్రి వల్లే తనకు ప్రాణహాని ఉందని సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు వైరల్ కావడంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందించారు. "వాడెవడో నాకు సంబంధం లేదు. ఆ విషయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా" అని ప్రకాశ్ గౌడ్ వ్యాఖ్యానించారు.

6 ఆగస్టు, 2026 6:09 PM•ByRalin

Share this article

'వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడి ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

హైదరాబాద్, ఆగస్టు 6 (జనవాణి): తన తండ్రి వల్లే తనకు ప్రాణహాని ఉందని సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు వైరల్ కావడంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందించారు. ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని తన తండ్రి వ్యతిరేకిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని సంతోష్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి ఆరోపించిన కొద్ది గంటల్లోనే ప్రకాశ్ గౌడ్ స్పందించారు. "వాడెవడో నాకు సంబంధం లేదు. ఆ విషయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా" అని ప్రకాశ్ గౌడ్ వ్యాఖ్యానించారు.

అసలేం జరిగింది?

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ మీడియా ముందు మాట్లాడుతూ.. మణికొండకు చెందిన శ్రేయాశ్రీతో తనకు జూలై 8న నిశ్చితార్థం జరిగిందని, గత నెల రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు. తన ప్రేమ వివాహాన్ని తండ్రి అంగీకరించడం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం40 మందితో తాను ఉంటున్న ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఏ క్షణమైనా తమపై దాడి జరిగే అవకాశం ఉందని చెబుతూ పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఈ నేపథ్యంలో మీడియా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను స్పందన కోరగా, ఆయన ప్రస్తుతం ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు నిరాకరించారు. "వాడెవడో నాకు సంబంధం లేదు. ఆ విషయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా" అని ప్రకాశ్ గౌడ్ వ్యాఖ్యానించారు. అయితే కుమారుడు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో పాటు, ఆరోపణలను నేరుగా ఖండించలేదు. సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని మాత్రమే పేర్కొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు