హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ పర్యటనకు బ్రేక్

పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా వరంగల్ పర్యటనకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

27 ఆగస్టు, 2026 11:16 AM•ByNarender Kumar Nangunoori

Share this article

హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ పర్యటనకు బ్రేక్

హైదరాబాద్, ఆగస్టు 27 (జనవాణి): పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా వరంగల్ వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఐటీఐ రంగంతో పాలిటెక్నిక్ విద్యార్హతలను అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు హరీశ్ రావు వరంగల్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. పోలీసులు ఆయనను కోకాపేటలోని నివాసం వద్దే అడ్డుకున్నారు. ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి, బయటకు వెళ్లకుండా గృహనిర్బంధం చేశారు.

పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిన జీవో 97ను సెప్టెంబర్ 7లోగా రద్దు చేయాలని హరీశ్ రావు ఇప్పటికే డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా జీవోను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే లక్ష మంది విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ తరఫున తానే ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు. అవసరమైతే విద్యార్థులు, ఇతర వర్గాలను కలుపుకుని సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కమిటీల పేరుతో విద్యార్థుల ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని హరీశ్ రావు విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

Loading Tweet...

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు