2026 అర్జున అవార్డుల ప్రకటన..క్రికెటర్లకు దక్కని చోటు

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అర్జున అవార్డుల విజేతలను ప్రకటించింది. చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్, అథ్లెట్ తేజస్విన్ శంకర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి గోపిచంద్ సహా పలువురు క్రీడాకారులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే ఈసారి అర్జున అవార్డుల జాబితాలో ఒక్క క్రికెటర్‌కు కూడా స్థానం లభించలేదు. అలాగే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును ఏ క్రీడాకారుడికీ ప్రకటించలేదు.

18 ఆగస్టు, 2026 4:32 PM•ByNarender Kumar Nangunoori

Share this article

2026 అర్జున అవార్డుల ప్రకటన..క్రికెటర్లకు దక్కని చోటు

AI Image

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అర్జున అవార్డుల విజేతల జాబితాను ప్రకటించింది. వివిధ క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈసారి చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్, అథ్లెట్ తేజస్విన్ శంకర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి గోపిచంద్ సహా పలువురు అవార్డు దక్కించుకున్నారు. అయితే ఈసారి అర్జున అవార్డుల జాబితాలో క్రికెటర్లకు చోటు దక్కలేదు. మరోవైపు దేశ అత్యున్నత క్రీడా పురస్కారాల్లో ఒకటైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును ఈ ఏడాది ఏ క్రీడాకారుడికీ ప్రకటించలేదు.

అర్జున అవార్డు విజేతలు

అథ్లెటిక్స్‌ నుంచి తేజస్విన్ శంకర్, మొహమ్మద్ అజ్మల్ వీ, ప్రియాంక గోస్వామి.

బ్యాడ్మింటన్ నుంచి త్రిష జొల్లి, గాయత్రి గోపిచంద్.

బాక్సింగ్ నుంచి నరేంద్ర బర్వాల్,

చెస్ నుంచి దివ్య దేశ్‌ముఖ్, విదిత్ సంతోష్ గుజ్రాతీ.

పారా షూటింగ్ నుంచి ధనుష్ శ్రీకాంత్, రుద్రన్స్.

హాకీ నుంచి లాల్‌రెస్మిమీ, రాజ్‌కుమార్ పాల్.

కబడ్డీ నుంచి సుర్‌జీత్, పూజా.

పారా అథ్లెటిక్స్ నుంచి ఎక్తా బ్యాన్.

రోయింగ్ నుంచి అరవింద్ సింగ్.

షూటింగ్ నుంచి అఖిల్ షోరన్ అర్జున అవార్డులకు ఎంపికయ్యారు.

1962 ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు అరుమైనాయగంకు ‘లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్’ విభాగంలో అర్జున అవార్డు లభించింది.

కామన్వెల్త్ పతక విజేతలకు ప్రాధాన్యం

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఈసారి అర్జున అవార్డుల ఎంపికలో ప్రాధాన్యం లభించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించి, భారత్‌కు డెకాథ్లాన్‌లో తొలి పతకాన్ని అందించిన తేజస్విన్ శంకర్ అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే పురుషుల 90 కేజీల హెవీవెయిట్ బాక్సింగ్ విభాగంలో రజత పతకం సాధించిన నరేంద్ర బర్వాల్ కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు.

కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు

అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటే లాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చావన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రకటించారు. బాక్సింగ్ కోచ్ ధర్మేంద్ర సింగ్ యాదవ్, రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర కుమార్లకు ద్రోణాచార్య లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డులు దక్కాయి. ఇక క్రీడల ప్రోత్సాహం, అభివృద్ధి విభాగంలో పూణేలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్ అకాడమీకి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు