విద్యార్థులకు బిహార్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇక మార్క్‌షీట్లలో ‘ఫెయిల్’ ఉండదు!

పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 10, 12వ తరగతి విద్యార్థుల మార్క్‌షీట్లలో ‘Fail’ అనే పదాన్ని ఉపయోగించకూడదని నిర్ణయించింది.

29 ఆగస్టు, 2026 6:40 PM•ByNarender Kumar Nangunoori

Share this article

విద్యార్థులకు బిహార్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇక మార్క్‌షీట్లలో ‘ఫెయిల్’ ఉండదు!

Social Media Image

పాట్నా, ఆగస్టు 29 (జనవాణి): విద్యార్థుల విషయంలో బిహార్ ప్రభుత్వం కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. పదో తరగతి, 12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల మార్క్‌షీట్లలో ఇకపై ‘Fail’ అనే పదం కనిపించదు. దాని స్థానంలో ‘Eligible for Skill Training’ అని పేర్కొనాలని బిహార్ విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ ఈ విషయాన్ని వెల్లడించారు. పరీక్షల్లో ఆశించిన స్థాయిలో మార్కులు రాకపోవడం విద్యార్థి ప్రతిభకు కొలమానం కాదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ధ్రువపత్రాల్లో ‘Fail’ అనే పదాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయనుంది.

సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

మెట్రిక్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అదనపు సహాయం అందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. సుమారు నెల రోజుల పాటు స్పెషల్ క్లాసులు నిర్వహించి, విద్యార్థులకు అదనపు ప్రిపరేషన్ అందించడం ద్వారా వారు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’

బిహార్ ప్రభుత్వం పాఠశాల విద్యావ్యవస్థలో ఇప్పటికే పలు మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలని నిర్ణయించింది. శనివారాల్లో పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే కొనసాగుతాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయి.

విద్యార్థులకు డిజిటల్ విద్యా సహాయం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ‘టీచర్ సపోర్ట్ పోర్టల్’ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ‘విద్యా సాథి’ App అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా విద్యార్థులు 24 గంటలూ ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల నుంచి విద్యా సహాయం పొందే అవకాశం కల్పించారు. విద్యార్థుల ప్రతిభను కేవలం పరీక్షల మార్కులతోనే అంచనా వేయకుండా, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా బిహార్ ప్రభుత్వం ఈ మార్పులను తీసుకొస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు