Prakash Raj | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు చేపడుతున్న ఆందోళనలకు నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు. ఈ అంశంపై శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన ప్రజలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
‘దేశంలో గణేష్ నిమజ్జనం పూర్తయింది.. జ్ఞానేష్ నిమజ్జనం మాత్రం మిగిలి ఉంది’ అంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, తొలగింపు డిమాండ్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా ఢిల్లీలో, ఆ తర్వాత ముంబైలో భారీ నిరసన కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రకాశ్ రాజ్ కోరారు. జ్ఞానేష్ కుమార్‌ను తొలగించే వరకు జరిగే ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో గాంధీ జయంతిని ప్రస్తావిస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ‘హ్యాపీ మహాత్మా గాంధీ జయంతి. ఈ రోజు బాపు పుట్టినరోజు’ అని పేర్కొన్న ప్రకాశ్ రాజ్.. కొందరు ఇప్పటికీ గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను కీర్తిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం, పౌర హక్కులను అణచివేసే ప్రయత్నాలను పౌర సమాజం, దేశ యువత అడ్డుకుంటారని ఆయన అన్నారు. ‘కాక్రోచ్‌లు వస్తున్నారు.. హ్యాపీ జయంతి’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించిన ప్రకాశ్ రాజ్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
Loading Tweet...




















