Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భయానక వరద..కొట్టుకుపోయిన బైలీ బ్రిడ్జి

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో చమోలీ జిల్లాలోని తమక్ నాలా ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ ఆకస్మిక వరద ధాటికి మలారి–నితి మార్గంలోని కీలక బైలీ బ్రిడ్జి కొట్టుకుపోయింది.

11 ఆగస్టు, 2026 5:58 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భయానక వరద..కొట్టుకుపోయిన బైలీ బ్రిడ్జి

Getty Image

ఉత్తరాఖండ్,ఆగస్టు 11(జనవాణి): భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ప్రకృతి బీభత్సం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం తమక్ నాలా ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించడంతో ఫ్లాష్‌ఫ్లడ్ సంభవించింది. వరద ఉద్ధృతి ధాటికి మలారి–నితి మార్గంలో ఉన్న కీలక బైలీ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కొట్టుకుపోయిన బైలీ బ్రిడ్జి

భారత్–చైనా సరిహద్దు ప్రాంతానికి కీలకమైన నితి వ్యాలీకి అనుసంధానంగా ఉన్న ఈ మార్గంలో బ్రిడ్జి కొట్టుకుపోవడంతో మలారి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఆకస్మికంగా భారీగా నీరు, మట్టి, రాళ్లు ప్రవహించడంతో బ్రిడ్జి తీవ్ర ఒత్తిడికి గురై కొట్టుకుపోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

BRO ఆపరేటర్ గల్లంతు

ఈ ఘటనలో BROకు చెందిన వాహనం, దాని ఆపరేటర్ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వాహనం కూడా వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

రంగంలోకి NDRF, SDRF

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన వ్యక్తి కోసం గాలించడంతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కనెక్టివిటీ దెబ్బతినడంతో సరిహద్దు ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరిగిందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తమక్ నాలా ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు