ఉత్తరాఖండ్‌లో విషాదం.. టన్నెల్ ప్రమాదంలో ఏడుగురు మృతి, 13 మందికి గాయాలు

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పీపల్‌కోటి సమీపంలోని మాయాపూర్‌లో నిర్మాణంలో ఉన్న THDC టన్నెల్‌లోకి ఒక్కసారిగా నీరు, బురద ప్రవేశించడంతో టన్నెల్‌ కుంగిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. మరో ముగ్గురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

14 ఆగస్టు, 2026 1:51 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఉత్తరాఖండ్‌లో విషాదం.. టన్నెల్ ప్రమాదంలో ఏడుగురు మృతి, 13 మందికి గాయాలు

Social Media Image

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర టన్నెల్ ప్రమాదం చోటుచేసుకుంది. పీపల్‌కోటి సమీపంలోని మాయాపూర్‌లో టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (THDC) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టన్నెల్‌లోకి ఒక్కసారిగా భారీగా నీరు, బురద వ్యర్థాలు ప్రవేశించడంతో ప్రమాదం సంభవించింది. సుమారు 2 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌లో 1.4 కిలోమీటర్ల లోతులో భూమి కుంగి రంధ్రం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో టన్నెల్‌లో మొత్తం 28 మంది కార్మికులు ఉన్నారు.

ఏడుగురు మృతి.. 13 మందికి గాయాలు

ప్రమాదం అనంతరం సహాయక బృందాలు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 18 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఏడుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన 13 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్‌లోని బేస్ ఆసుపత్రికి తరలించారు. టన్నెల్‌లో చిక్కుకున్న మరో ముగ్గురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. నీరు, బురద వ్యర్థాలను తొలగిస్తూ కార్మికుల జాడను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం

ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని తెలిపారు. అన్ని సంబంధిత శాఖలు, రెస్క్యూ సంస్థలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు