రోడ్డుపై వరద నీరు.. అందులో మొసలి ప్రత్యక్షం, షాకైన స్థానికులు

భారీ వర్షాలతో బ్యాంకాక్‌లోని ఓ నివాస ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలో మోకాలి లోతు నీటిలో ఓ మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు పిల్లలు, పెద్దలు కలిసి కర్రల సాయంతో దాన్ని జనావాసానికి దూరంగా తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

30 సెప్టెంబర్, 2026 4:03 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రోడ్డుపై వరద నీరు.. అందులో మొసలి ప్రత్యక్షం, షాకైన స్థానికులు

భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడం సాధారణమే. అయితే బ్యాంకాక్‌లోని ఓ నివాస ప్రాంతంలో వరద నీటితో పాటు మొసలి కూడా ప్రత్యక్షం కావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మోకాలి లోతు నీటితో నిండిన వీధిలో మొసలి కనిపించడంతో అక్కడి ప్రజలు అప్రమత్తమయ్యారు.

మొసలిని జనావాస ప్రాంతం నుంచి దూరంగా తరలించేందుకు కొందరు స్థానికులు సాహసం చేశారు. ఓ వ్యక్తి పొడవాటి కర్ర సాయంతో మొసలిని నెమ్మదిగా ఈడ్చుకుంటూ వెళ్లగా మరో వ్యక్తి అతడికి సహకరించాడు. చివరకు అందరూ కలిసి దాన్ని ఇళ్లకు దూరంగా తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వరదల సమయంలో మొసళ్లు, పాములు వంటి వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

‘చేప అనుకుని గాలం వేస్తే పెద్ద మొసలి పడిందే’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘వరద భయం ఆ మొసలికి కూడా ఉంది’ అని మరో వ్యక్తి స్పందించారు. ‘పెద్ద గండం గడిచింది’ అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు