భారీ వర్షాలతో బ్యాంకాక్‌లోని ఓ నివాస ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలో మోకాలి లోతు నీటిలో ఓ మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు పిల్లలు, పెద్దలు కలిసి కర్రల సాయంతో దాన్ని జనావాసానికి దూరంగా తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bangkok Floods: బ్యాంకాక్‌లో భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి. 3 రోజుల్లో 30 సెం.మీ.కు పైగా వర్షంతో ఇళ్లు, కార్లు నీటమునిగాయి. రోడ్లు జలమయం కాగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
భారత్‌లో వినాయకుడికి లడ్డూలు, మోదకాలు, ఉండ్రాళ్లు, కుడుములు నైవేద్యంగా సమర్పించడం సాధారణం. అయితే థాయ్‌లాండ్‌లో మాత్రం గణేశుడికి బబుల్ టీని నైవేద్యంగా సమర్పించే ప్రత్యేక ఆచారం కనిపిస్తోంది. బ్యాంకాక్‌లోని యూనియన్ మాల్ సమీపంలోని గణేశుడి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో బబుల్ టీ కప్పులను సమర్పిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.