దుబాయ్ విమానంలో హైజాక్ అలర్ట్..ఫైటర్ జెట్ల రంగప్రవేశం!

దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో హైజాక్‌ అలర్ట్‌ కలకలం రేపింది. సౌదీ అరేబియా గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం నుంచి రెండు అత్యవసర సంకేతాలు వెలువడినట్లు ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు తెలిపాయి. దీంతో ఇజ్రాయెల్‌ అధికారులు అప్రమత్తమై ఫైటర్‌ జెట్లను రంగంలోకి దించారు. విమానాన్ని సౌదీ అరేబియా వైపు మళ్లించినట్లు సమాచారం.

30 సెప్టెంబర్, 2026 1:43 PM•ByNarender Kumar Nangunoori

Share this article

దుబాయ్ విమానంలో హైజాక్ అలర్ట్..ఫైటర్ జెట్ల రంగప్రవేశం!

Social Media Image

దుబాయ్‌,సెప్టెంబర్ 30 (జనవాణి): దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో హైజాక్‌ అలర్ట్‌ కలకలం రేపింది. ఫ్లైదుబాయ్‌కు చెందిన FZ1073 విమానం బుధవారం సౌదీ అరేబియా గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో రెండు అత్యవసర కోడ్‌లను ప్రసారం చేసినట్లు ఇజ్రాయెల్‌ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

వాటిలో ఒక కోడ్‌ విమానాన్ని హైజాక్‌ చేసే అవకాశం ఉందన్న సంకేతాన్ని ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇజ్రాయెల్‌ భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా యుద్ధ విమానాలను రంగంలోకి దించి పరిస్థితిని పర్యవేక్షించినట్లు నివేదికలు వెల్లడించాయి.

హైజాక్‌ అనుమానాస్పద సంకేతాలు వెలువడిన నేపథ్యంలో FZ1073 విమానాన్ని టెల్ అవీవ్‌ వెళ్లకుండా సౌదీ అరేబియా వైపు మళ్లించినట్లు సమాచారం. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానం నుంచి అత్యవసర కోడ్‌లు ఎందుకు ప్రసారమయ్యాయి? వాటి వెనుక అసలు కారణం ఏమిటి? అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, ఘటన అనంతరం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా తెలిపింది. విమానంలో వాస్తవంగా ఏం జరిగిందన్నది అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టత రానుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు