ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ గొడ్డలితో చేసిన దాడిలో తీవ్రంగా గాయపడినా.. విమానాన్ని అదుపులో ఉంచి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు పుర్రెలో తీవ్ర ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అబుధాబిలో చికిత్స పొందుతున్న ఆయన వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు.
ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒమన్ జాతీయుడు, కో పైలట్ హమామ్ అల్-హమ్మామి విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఫ్లైదుబాయ్‌లో చేరకముందే దాడికి ప్రణాళిక రచించినట్లు, గాజాపై దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడాలని భావించినట్లు దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం.
ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న హైజాక్ ప్రయత్నం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. విమానం టెల్ అవీవ్ వైపు దూసుకొస్తుండటంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైందని, అవసరమైతే విమానాన్ని కూల్చివేయాలని కూడా ఒక దశలో నిర్ణయించినట్టు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ప్రయాణికులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు విమానం సౌదీ వైపు మళ్లడంతో ఇజ్రాయెల్ ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్టు సమాచారం.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ జరిపిన దాడిని యూఏఈ ప్రాసిక్యూటర్లు ఉగ్రవాద చర్యగా ధృవీకరించారు. విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని కూల్చివేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.
ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ దాడికి గురైనప్పటికీ 173 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు. తీవ్ర గాయాలతోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించిన కెప్టెన్ ధైర్యాన్ని ప్రధాని ప్రశంసించారు. ఘటన సమయంలో హనుమాన్ చాలీసా జపించానని కెప్టెన్ స్మిత్ తెలిపారు.
ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన కాక్‌పిట్ దాడి తీవ్ర కలకలం రేపింది. దాడిలో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ తీవ్రంగా గాయపడి భారీగా రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇజ్రాయెల్ దంత వైద్యుడు డాక్టర్ షోటా మొసావ్ వెంటనే కాక్‌పిట్‌లోకి వెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన సకాలంలో స్పందించడం పైలట్ ప్రాణాలను కాపాడడంలో కీలకంగా మారింది.
దుబాయ్ నుంచి టెల్‌అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో కో-పైలట్ కత్తితో దాడి చేయడంతో విమానం ప్రమాదకరంగా కిందికి పడిపోయింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యంగా ప్రతిఘటించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆయన అసాధారణ సాహసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సహ పైలట్ దాడి చేసినప్పటికీ భారతీయ కెప్టెన్ ప్రాణాలకు తెగించి అతడిని ఎదుర్కొన్నారు. అదే సమయంలో విమానంపై నియంత్రణ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుని సుమారు 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థలు వెల్లడించాయి.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరగడంతో విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడ్డాయి. దీంతో హైజాక్ అనుమానాలు తలెత్తగా చివరకు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో హైజాక్ అలర్ట్ కలకలం రేపింది. సౌదీ అరేబియా గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం నుంచి రెండు అత్యవసర సంకేతాలు వెలువడినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు తెలిపాయి. దీంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమై ఫైటర్ జెట్లను రంగంలోకి దించారు. విమానాన్ని సౌదీ అరేబియా వైపు మళ్లించినట్లు సమాచారం.