కత్తిపోట్లతో గాయపడినా పోరాడిన కెప్టెన్‌.. 180 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్

దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సహ పైలట్ దాడి చేసినప్పటికీ భారతీయ కెప్టెన్ ప్రాణాలకు తెగించి అతడిని ఎదుర్కొన్నారు. అదే సమయంలో విమానంపై నియంత్రణ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుని సుమారు 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థలు వెల్లడించాయి.

30 సెప్టెంబర్, 2026 6:33 PM•ByNarender Kumar Nangunoori

Share this article

 కత్తిపోట్లతో గాయపడినా పోరాడిన కెప్టెన్‌.. 180 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్

Social Media Image

దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఉగ్రదాడి ప్రయత్నం జరిగినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘటనలో విమానానికి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భారతీయ పైలట్ కీలకంగా వ్యవహరించి సుమారు 180 మంది ప్రయాణికులను కాపాడినట్లు సమాచారం.

విమానంలో ఉన్న సహ పైలట్ ఒక్కసారిగా భారతీయ కెప్టెన్‌పై కత్తితో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన సహ పైలట్‌ను కెప్టెన్ అడ్డుకున్నారని సమాచారం. దాడిని ఎదుర్కొంటూనే మరోవైపు విమానంపై నియంత్రణ కొనసాగిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

పరిస్థితి తీవ్రంగా మారడంతో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్‌-డ్యూటీ పైలట్లు కూడా రంగంలోకి దిగారు. వారి సహకారంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని ఓ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు సమాచారం.

ఈ ఘటనలో భారతీయ కెప్టెన్‌తో పాటు సహ పైలట్‌కు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఇజ్రాయెల్‌ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

సహ పైలట్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడని, అందుకు అడ్డుగా నిలిచిన భారతీయ కెప్టెన్‌పై కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి గల కారణాలపై అధికారిక దర్యాప్తు కొనసాగాల్సి ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు