నేపాల్‌లో జలవిలయం.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య..4,700 మందికిపైగా గల్లంతు

నేపాల్‌లో గతవారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియల విరిగిపడటంతో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. అధికారిక లెక్కల ప్రకారం నేపాల్‌లో 987 మంది, టిబెట్‌లో 16 మంది మృతి చెందగా.. 4,700 మందికిపైగా గల్లంతయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.

1 సెప్టెంబర్, 2026 12:12 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నేపాల్‌లో జలవిలయం.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య..4,700 మందికిపైగా గల్లంతు

X image

Nepal Flash Floods | సెప్టెంబర్ 01 (జనవాణి): హిమాలయ దేశం నేపాల్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. గతవారం సంభవించిన (Flash Floods) కొండచరియల విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారిక సమాచారం ప్రకారం.. నేపాల్‌లో ఇప్పటివరకు 987 మంది మృతి చెందారు. టిబెట్ వైపు మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ విపత్తులో మొత్తం మృతుల సంఖ్య వెయ్యికి చేరువైంది. మరోవైపు 4,700 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో నేపాల్‌లోనే 3,916 మంది ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైన వారిలో 583 మంది విదేశీయులు ఉన్నారు.

ఇప్పటివరకు కనీసం 11,814 మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. అయితే వరదలు, కొండచరియల కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను చేరుకోవడం సహాయక బృందాలకు సవాల్‌గా మారింది. ప్రస్తుతం నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సహాయక, రెస్క్యూ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా రోడ్డు మార్గంలో చేరుకోవడం కష్టంగా ఉండటంతో అత్యవసర సిబ్బంది హెలికాప్టర్లు, ఇతర విమానాలను ఉపయోగిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు