నేపాల్‌లో చూస్తుండగానే క్షణాల్లో కుప్పకూలిన కొండ..బండరాళ్లు, చెట్లతో భయానక దృశ్యాలు!

నేపాల్‌లోని మనంగ్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చామే ప్రాంతంలో ఒక్కసారిగా భారీ బండరాళ్లు, మట్టి, చెట్లు కొండపై నుంచి కిందికి జారిపడగా సమీపంలోని ఓ ఇంటి భాగం కూడా కొండచరియలతో పాటు కూలిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

30 సెప్టెంబర్, 2026 1:53 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నేపాల్‌లో చూస్తుండగానే క్షణాల్లో కుప్పకూలిన కొండ..బండరాళ్లు, చెట్లతో భయానక దృశ్యాలు!

నేపాల్‌,సెప్టెంబర్ 30 (జనవాణి): నేపాల్‌లోని మనంగ్ జిల్లాలో ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడటంతో అక్కడి పరిస్థితి క్షణాల్లో భయానకంగా మారింది. మనంగ్ జిల్లాలోని చామే ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో తొలుత కొండ ప్రాంతం సాధారణంగానే కనిపిస్తుంది. అంతలోనే భారీ బండరాయి, మట్టి, రాళ్లు ఒక్కసారిగా కిందికి జారడం ప్రారంభమవుతుంది. చూస్తుండగానే కొండలోని ఓ పెద్ద భాగం కుప్పకూలుతుంది. దీంతో కొండపై ఉన్న చెట్లు నేలకొరిగాయి. అంతటితో ఆగకుండా సమీపంలోని ఓ ఇంటి భాగం కూడా కొండచరియలతో కలిసి కిందికి జారిపడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. భారీ బండరాయి కూలిపడటంతో మొదలైన ఈ పరిణామం కొన్ని క్షణాల్లోనే మరింత తీవ్రంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను @zingabad అనే యూజర్ ఎక్స్‌లో పోస్టు చేసినట్లు సమాచారం. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఆ దృశ్యం చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది”, “ఇలాంటి ప్రదేశాల్లో ఎలా జీవిస్తారు?” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు “అదృష్టవశాత్తూ అక్కడ మనుషులు లేరేమో” అంటూ స్పందించారు. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా పూర్తి స్థాయి ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కొండచరియలకు సంబంధించిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు