బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగాలు..రూ.85,920 వరకు జీతం

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

19 ఆగస్టు, 2026 1:26 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగాలు..రూ.85,920 వరకు జీతం

హైదరాబాద్, ఆగస్టు 19 (జనవాణి): బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖల్లో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రాల వారీగా పోస్టులు

మొత్తం 2,482 పోస్టుల్లో జనరల్ కేటగిరీలో 981, ఈడబ్ల్యూఎస్ 303, ఓబీసీ 600, ఎస్సీ 358, ఎస్టీ కేటగిరీలో 240 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 50 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 80 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా గుజరాత్‌లో 400, మహారాష్ట్రలో 180, కర్ణాటకలో 130 పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగానికి కావాల్సిన అర్హత

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో పోస్ట్-క్వాలిఫికేషన్ కనీసం ఒక సంవత్సరం పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం ఉండాలి. 2026 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ఇంగ్లిష్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్/ఎకానామిక్ అవేర్‌నెస్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

జీతం

ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. దీనికి అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు లభిస్తాయి.

దరఖాస్తు ఫీజు

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు రూ.175 ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన వివరాలు

పోస్టు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)

మొత్తం ఖాళీలు: 2,482

తెలంగాణ: 50

ఆంధ్రప్రదేశ్: 80

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

చివరి తేదీ: సెప్టెంబర్ 7, 2026

జీతం: రూ.48,480–రూ.85,920 + అలవెన్సులు

అధికారిక వెబ్‌సైట్: www.bankofbaroda.bank.in

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు