లాల్‌దర్వాజా బోనాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్‌

లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా 48 గంటల పాటు 2,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఏఐ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టామన్నారు.

9 ఆగస్టు, 2026 4:13 PM•ByRalin

Share this article

లాల్‌దర్వాజా బోనాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్‌

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్, ఆగస్టు 9 (జనవాణి): ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆదివారం పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోనాల పండగను పురస్కరించుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. భక్తుల సహకారంతో ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

శాంతిభద్రతల పరిరక్షణకు అత్యాధునిక ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సజ్జనార్‌ తెలిపారు. ముఖ్యంగా దొంగలు, చైన్‌ స్నాచర్లను త్వరగా గుర్తించేందుకు ఏఐ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. బందోబస్తు కోసం 2,400 మంది పోలీసు సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించి విధులు కేటాయించినట్లు చెప్పారు.

భక్తుల రక్షణ కోసం షీ టీమ్స్‌, క్రైమ్‌ టీమ్స్‌ను రంగంలోకి దించడంతో పాటు ఆలయాల వద్ద ప్రత్యేక పికెటింగ్‌ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఆలయ ప్రాంగణాలతో పాటు ఊరేగింపు సాగే మార్గాల్లో డ్రోన్లు, అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు లాల్‌దర్వాజా యూనియన్‌ బ్యాంక్‌ వద్ద ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సజ్జనార్‌ తెలిపారు. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అదనపు సీపీ క్రైమ్స్‌ శ్రీనివాస్‌, అదనపు సీపీ లా అండ్‌ ఆర్డర్‌ తఫ్షీర్‌ ఇక్బాల్‌, జాయింట్‌ సీపీ ట్రాఫిక్‌ జోయల్‌ డేవిస్‌, చార్మినార్‌ జోన్‌ డీసీపీ ఖారే కిరణ్‌ ప్రభాకర్‌, ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే, డీసీపీ సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఆర్‌. వెంకటేశ్వర్లు, డీసీపీలు శ్రీనివాస్‌, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు