వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్, FRRO, ఐటీ సెల్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు 49 మంది అక్రమ విదేశీయులను గుర్తించారు. వీరిలో 12 మందిని ఇప్పటికే స్వదేశాలకు పంపగా.. మరో 37 మందిని హోల్డింగ్ సెంటర్లలో ఉంచారు. విచారణలో నకిలీ కరెన్సీ, డ్రగ్స్, మోసాలు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో కొత్త జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు పోలీస్ స్టేషన్ల పరిధులను మార్చింది. కొన్ని స్టేషన్ల పేర్లను సవరించగా, మరికొన్ని ప్రాంతాలను ఇతర పోలీస్ స్టేషన్లలో విలీనం చేసింది.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని ఓయో హోటల్‌లో మహిళ హత్య కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తితో కలిసి హోటల్‌లో దిగిన శిరీష గదిలో రక్తపు గాయాలతో మృతిచెందిన స్థితిలో కనిపించింది. ఆమెతో వచ్చిన శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయి కనిపించకుండా పోవడంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, హోటల్ రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో రెండు రోజులుగా కొనసాగిన గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శోభాయాత్ర విజయవంతంగా పూర్తవడంతో పోలీసులు, అధికారులు సంబరాలు చేసుకున్నారు.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని చార్మినార్, పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలతో తనిఖీలు చేపడుతూ సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర మాత్రం బాహుబలి క్రేన్‌లో సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. సమస్యను పరిష్కరించిన అనంతరం మహాగణపతిని టస్కర్‌పైకి చేర్చి శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ ఎక్కుతున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డు ఆమెను పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ ఓయో హోటల్‌లో మహిళ తీవ్రగాయాలతో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ప్రియుడితో కలిసి హోటల్‌లో దిగిన మహిళ అనంతరం ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. ఘటన అనంతరం ప్రియుడు శ్రీనివాస రవితేజ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ మలక్‌పేట్‌లో పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. మృతికి ముందు ఓ యువతికి వీడియో కాల్ చేసి తాను ఉరేసుకుంటున్నట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో అక్రమంగా డిస్పోజల్ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే ఆపరేషన్‌లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డుపై తనిఖీలు నిర్వహించి డీసీఎంలో తరలిస్తున్న 425 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవానికి ఈసారి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనల నేపథ్యంలో ట్యాంక్ బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని అధికారులు నిషేధించారు. భక్తుల కోసం నగరవ్యాప్తంగా ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలు, కృత్రిమ చెరువులు, ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేస్తున్నారు.
వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ మండపాలకు జియో ట్యాగింగ్, ప్రధాన నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక, సోషల్ మీడియాలో వదంతులపై 24 గంటల నిఘా వంటి చర్యలకు సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ పరిసరాల్లో డిటోనేటర్ల కలకలం రేగింది. ఫైరింగ్ క్యాంప్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న బకెట్‌ను పోలీసులు తనిఖీ చేయగా 160 డిటోనేటర్లు బయటపడ్డాయి. దీంతో బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇన్నోవా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన బిహార్‌కు చెందిన నందులాల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరో కారు ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి టీటీడీ బోర్డు సభ్యుడు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో ప్రేమ విఫలమై ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. అంబర్‌పేటలోని తిరుమలనగర్‌కు చెందిన నిభాష్ ఓ యువతిని కొంతకాలంగా ప్రేమించారు. అయితే పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు స్నేహితులకు వాట్సాప్‌లో మెసేజ్ పంపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా 48 గంటల పాటు 2,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఏఐ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టామన్నారు.
హైదరాబాద్‌లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై H-FAST, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి 13 మసాలా ప్రాసెసింగ్, ట్రేడింగ్ యూనిట్లపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 25 టన్నుల విషపూరిత, రసాయనాలతో కల్తీ చేసిన మసాలా దినుసులను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన... హైదరాబాద్‌లో బోనాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, భక్తుల భద్రతకు పోలీసులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆగస్టు 2 నుంచి 4వ తేదీ తెల్లవారుజామున వరకు ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు రోడ్లను మూసివేయడంతో పాటు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులో ఉంచారు.
పాతబస్తీలో అత్యంత వైభవంగా జరిగే లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఆలయంలో జరిగిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆగస్టు 11వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
పోలీస్ అధికారి కావాలన్న దివ్యాంగ యువకుడు రాహుల్ చిరకాల కోరికను మల్కాజ్‌గిరి పోలీసులు నెరవేర్చారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి స్వయంగా రాహుల్‌ను కమిషనరేట్‌కు ఆహ్వానించి, తన కార్యాలయంలో కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనుభూతిని కల్పించారు.
హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ గృహాల కేటాయింపు ప్రక్రియ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు.