అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. ఇదే కారణం!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకుని, ఆదివారం మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఢిల్లీలో కొనసాగుతున్న కీలక రాజకీయ, రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దైనట్లు సమాచారం.

3 అక్టోబర్, 2026 6:38 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. ఇదే కారణం!

న్యూ ఢిల్లీ,అక్టోబర్ 3 (జనవాణి): కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి ఆయన హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. ఆదివారం ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేలా పర్యటన ఖరారైంది. అయితే ఢిల్లీలో బిజీ షెడ్యూల్ కారణంగా తెలంగాణ పర్యటన రద్దైనట్లు సమాచారం.

అమిత్ షా శనివారం రాత్రి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో బస చేయాల్సి ఉంది. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మెదక్ జిల్లా తూప్రాన్‌కు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు. తూప్రాన్‌లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్‌లో సబర్ డెయిరీ ప్రాజెక్టుకు భూమిపూజతో పాటు, రాష్ట్రంలో అమూల్ ఏర్పాటు చేస్తున్న తొలి ఆధునిక డెయిరీ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది.

అనంతరం ఆయన కరీంనగర్ వెళ్లి ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. ప్రతిమ డీమ్డ్ యూనివర్సిటీ భవనానికి శంకుస్థాపన చేసి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. కరీంనగర్ పర్యటన అనంతరం హైదరాబాద్‌కు చేరుకుని తెలంగాణ బీజేపీ నాయకులతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరపనున్నట్లు ముందుగా సమాచారం. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీలోనూ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అమిత్ షాకు బిజీ షెడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణాలతోనే ఆయన తెలంగాణ పర్యటన రద్దైనట్లు సమాచారం.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు