బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలు.. ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: మంత్రి పొన్నం ప్రభాకర్

బిహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం దేశ రాజకీయాల్లో కీలక పరిణామమని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

3 ఆగస్టు, 2026 8:50 PM•ByRalin

Share this article

బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలు.. ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్

బిహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం దేశ రాజకీయాల్లో కీలక పరిణామమని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బంకిపూర్‌లో ఆ పార్టీ పరాజయం పాలవ్వడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

బిహార్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సొంత నియోజకవర్గంగా పేరొందిన బంకిపూర్‌లో బీజేపీ ఓటమి ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పునకు సంకేతమని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ ఎన్నికల్లో జన సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ద్వారా.. ప్రజలు తమ తీర్పుతో బీజేపీ అహంకారానికి గట్టి సమాధానం చెప్పారని వ్యాఖ్యానించారు.

దేశంలో తమకు ఎదురేలేదని, ప్రజలు తమ వెంటే ఉన్నారని విర్రవీగుతున్న బీజేపీకి బంకిపూర్ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా గుణపాఠం చెప్పారని అన్నారు. అధికార బలం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రచార ఆర్భాటం ఎంత ఉన్నా ప్రజల తీర్పును ఎవరూ మార్చలేరని ఈ ఎన్నిక మరోసారి నిరూపించింది అని పేర్కొన్నారు. బీజేపీకి పునాదులే కదిలిపోతున్నాయనే సంకేతాలను బంకిపూర్ ఉపఎన్నిక ఫలితం స్పష్టంగా వెల్లడించిందన్నారు. ప్రజల సమస్యలను విస్మరించి, అహంకారపూరిత పాలన కొనసాగిస్తే ప్రజలు సరైన సమయంలో తగిన తీర్పు ఇస్తారని స్పష్టం చేశారు.

ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా నిలిచిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమవుతోందనే భావన ప్రజల్లో బలపడుతోందని తెలిపారు.

బంకిపూర్‌లో వచ్చిన తీర్పు కేవలం ఒక నియోజకవర్గ ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ప్రజల సంకల్పానికి ప్రతీక అని మంత్రి అన్నారు. ప్రజల గొంతుకను అణచివేయాలని ప్రయత్నించే రాజకీయాలకు దేశ ప్రజలు తగిన సమయంలో సరైన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అని.. ప్రజల తీర్పే అంతిమం అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలవడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని అన్నారు. ఇదే ప్రజా చైతన్యం రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో మరింత పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు