హైదరాబాద్‌లో ప్రజా రవాణా మరింత సులభతరం కానుంది. మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే పాస్‌తో వినియోగించుకునే మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కామన్ పాస్‌ను ఆవిష్కరించారు. ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు నగరంలో ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.
మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (సెప్టెంబరు 26) ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించి, దేశానికి, తెలంగాణకు మన్మోహన్ సింగ్ అందించిన సేవలను స్మరించుకున్నారు.
హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నగరానికి నలువైపులా గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి గణేశ్ ఉత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో 'పంచముఖ సంకటహర మహాగణపతి’గా కొలువుదీరిన బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా తొలి పూజలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క డిమాండ్ చేశారు. ఆయనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ డి. ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా, కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని 13 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
తెలంగాణలోని బీసీ మహిళలకు ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టుమిషన్లను పంపిణీ చేయనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 మంది బీసీ మహిళలకు ఈ ప్రయోజనం అందనుంది.
బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతి వైభవానికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
బీసీల సమస్యల పరిష్కారం, కులగణన తదుపరి ప్రక్రియ, సంక్షేమ పథకాల అమలు, ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై హైదరాబాద్‌లో బీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పూలే దంపతులు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు నిర్వహించే ఈ డ్రైవ్‌లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఈసీ (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) కార్యక్రమాన్ని శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రారంభించారు.
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రామాల మధ్య రహదారి అనుసంధానం కోసం 29 వంతెనల నిర్మాణానికి రూ.33 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు.
ప్రకృతి సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని వరం అందించవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సైదాబాద్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న స్టీల్ బ్రిడ్జితో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జిని మంత్రి అజారుద్దీన్‌తో కలిసి హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు.
బిహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం దేశ రాజకీయాల్లో కీలక పరిణామమని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో ఆదివారం నాడు బోనాల సంబురాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బోనాల విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే లష్కర్ బోనాల మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
గౌరవెల్లి, పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మ సాగర్ సాగునీటి ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు నిర్వహించిన 'డయల్ యువర్ ఎమ్మెల్యే' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు జంక్షన్‌ను రూ.3.22 కోట్లతో అభివృద్ధి చేసి సుందరీకరించడంతో పాటు బస్ షెల్టర్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు.
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రంలో రూ.1.10 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం శంకుస్థాపన చేశారు.
సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు పాడిపంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
గురుపూర్ణిమ సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని అంజన్నను ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. విమర్శలు చేసే ముందు కొన్ని కీలక ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.99.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న పనులకు ఈ నిధులు తోడవడంతో ఆలయ అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నిరుపేదలకు జనావాసాలకు దూరంగా కాకుండా, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలతో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీల అరెస్టును నిరసిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది