మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తుండటంతో అభిమానుల్లో జోష్ మరింత పెరుగుతోంది. సంక్రాంతికి విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న చిరంజీవి.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘కాకా’ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గతంలో చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ‘కాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సైతం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఇక ‘కాకా’ తర్వాత చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘దసరా’ సినిమాతో తనదైన రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో ఆకట్టుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని నిర్మించనుండటం మరో ప్రత్యేకత. మెగాస్టార్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, శ్రీకాంత్ ఓదెల స్టైల్‌లో రస్టిక్ టచ్‌తో కూడిన విభిన్న కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘దసరా’లో కనిపించిన మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ ట్రీట్‌మెంట్‌కు మించి ఈ సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో కలిసి తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా విడుదల అనంతరం చిరంజీవి ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు చిరంజీవి కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేసి, మార్చి నాటికి శ్రీకాంత్ ఓదెల సినిమాకు అందుబాటులోకి రావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో చిరంజీవిని ఇంతకుముందెన్నడూ చూడని విలక్షణమైన రస్టిక్ అవతార్‌లో చూపించేందుకు శ్రీకాంత్ ఓదెల సిద్ధమవుతున్నారట. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్లు టాక్. మాస్ ఇమేజ్‌కు మెగాస్టార్.. రా అండ్ రస్టిక్ మేకింగ్‌కు శ్రీకాంత్ ఓదెల.. నిర్మాణంలో నాని.. ఇలా మూడు క్రేజీ పేర్లు కలుస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే భారీ హైప్ నెలకొంది. మరి ఈ విభిన్న కాంబినేషన్‌లో శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారో చూడాలి.




















