మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా వస్తే అది టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించాలని తాను కోరుకుంటున్నట్లు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెలిపారు. అవకాశం వస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కోసం బుచ్చిబాబు రా అండ్ రస్టిక్ నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి ఘన నివాళులర్పించారు. సత్యం, అహింసతో గాంధీజీ అందించిన పోరాట స్ఫూర్తిని, ‘జై జవాన్–జై కిసాన్’ నినాదంతో శాస్త్రి చూపిన దేశభక్తిని గుర్తుచేసుకుంటూ ఎక్స్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసి 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. చిరంజీవి సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న చరణ్.. 50 ఏళ్ల మైలురాయిని కలిసి జరుపుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.
బ్లడ్ బ్యాంక్ పేరుతో రక్తం విక్రయిస్తున్నారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమాల ద్వారా వస్తున్న తన సంపాదన తనకు సరిపోతుందని, రక్తం అమ్ముకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నానని తెలిపారు. జీవితంలో ఎదగడానికి క్రమశిక్షణ, కష్టపడే తత్వమే కారణమని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిమానులకు సూచించారు.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చిత్రంలో నటిస్తున్న చిరు.. ఆ తర్వాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
సినిమా చిన్నదా.. పెద్దదా అని చూడకుండా మంచి విజయం సాధించిన చిత్రాలను అభినందించడం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకత. తాజాగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న ‘ఇరుముడి’ చిత్రబృందాన్ని చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. చిత్రబృందాన్ని ఇంటికి ఆహ్వానించి ఆప్యాయంగా ముచ్చటించిన మెగా హీరోల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గోదావరి జిల్లాల్లో ఎంతో క్రేజ్ ఉన్న పులస చేప మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. కోటిపల్లి గోదావరిలో మత్స్యకారుల వలకు చిక్కిన కేజీన్నర బరువున్న పులసను యానాం మార్కెట్‌లో రూ.20 వేలకు కొనుగోలు చేసి, ఓ వ్యక్తి చిరంజీవికి బహుమతిగా పంపించినట్లు మత్స్యకారులు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సీడ్ గణేశుడిని పూజించాలని సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను తన నివాసంలో ఆవిష్కరించిన చిరంజీవి.. పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే వినాయకుడు మొక్కగా మారి మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి ‘ఇరుముడి’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రవితేజ నటన, శివ నిర్వాణ దర్శకత్వంతో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు. అయితే చివర్లో “ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మహారాష్ట్ర ఎమ్మెల్సీ విక్రమ్ కాకడే పావ్నా నివాసంలో ప్రత్యేకంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘కాకా’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవిని సరికొత్త మాస్ అవతార్‌లో చూపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ‘చిరు లీక్స్’తో అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 158వ చిత్రానికి ‘కదిరి’ అనే టైటిల్‌ను అనుకోకుండా లీక్ చేశారు. అంతేకాదు, ఆగస్టు 22న తన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.