Warangal | రేవంత్ సర్కార్ 1,000 రోజుల సందర్బంగా కాంగ్రెస్‌ ఉచిత ఉల్లిగడ్డల పంపిణీలో ఉద్రిక్తత

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేదలకు 1,000 కిలోల ఉల్లిపాయలను పంపిణీ చేశారు. వరంగల్ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

1 సెప్టెంబర్, 2026 6:54 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Warangal | రేవంత్ సర్కార్ 1,000 రోజుల సందర్బంగా కాంగ్రెస్‌ ఉచిత ఉల్లిగడ్డల పంపిణీలో ఉద్రిక్తత

వరంగల్, సెప్టెంబర్ 01 (జనవాణి): తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం వరంగల్ చౌరస్తాలో పేదలకు 1,000 కిలోల ఉల్లిపాయలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఉల్లిపాయల పంపిణీకి భారీగా ప్రజలు తరలిరావడంతో వరంగల్ చౌరస్తా జనంతో కిక్కిరిసిపోయింది. దీంతో దాదాపు గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ‘సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజనాల శ్రీహరి ఉల్లిగడ్డల పంపిణీ సమయంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా జనం ఉల్లిగడ్డల కోసం ఎగబడ్డారు. ఉల్లిగడ్డలు తీసుకునేందుకు ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళల పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో సదరు కాంగ్రెస్‌ నేత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు