సైబరాబాద్‌లో 24 గంటలు మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లు, రెస్టారెంట్లు బంద్

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లు, రెస్టారెంట్లను మూసివేయనున్నారు.

22 సెప్టెంబర్, 2026 7:30 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సైబరాబాద్‌లో 24 గంటలు మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లు, రెస్టారెంట్లు బంద్

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (జనవాణి): గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగా సైబరాబాద్ పరిధిలోని మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లు, రెస్టారెంట్లను మూసివేయనున్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ వెల్లడించారు.

నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్ణయించిన సమయాల్లో నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు లేదా సంబంధిత కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు