హైదరాబాద్‌లో రెండు రోజులుగా కొనసాగిన గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శోభాయాత్ర విజయవంతంగా పూర్తవడంతో పోలీసులు, అధికారులు సంబరాలు చేసుకున్నారు.
హైదరాబాద్ గణేశ్ నిమజ్జన వేడుకల్లో భక్తి, సందడి నడుమ పోలీసుల సరదా డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. గణేష్ నిమజ్జనం సందర్భంగా కొందరు పోలీసులు డ్యాన్స్ స్టెప్పులతో సందడి చేయగా ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి కూడా ట్రాన్స్‌జెండర్లను భద్రతా విధుల్లో భాగస్వాములను చేశారు. మొత్తం 17 మంది ట్రాన్స్‌జెండర్లు పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తూ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించారు.
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపయ్య నిమజ్జనం ఘనంగా పూర్తైంది. ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్-4 వద్ద పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహాన్ని ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మ ఒడికి చేర్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. టస్కర్ ముందు దానం నాగేందర్ కొబ్బరికాయ కొట్టి యాత్రను ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని చార్మినార్, పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలతో తనిఖీలు చేపడుతూ సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, మెట్రో, టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం గణనాథుడిని నిమజ్జనం చేయనున్నారు. అయితే నిమజ్జనం సందర్భంగా మరో ప్రత్యేకత భక్తులను ఆకట్టుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ఏటా ఖైరతాబాద్ గణేశుడికి సమర్పించే భారీ లడ్డూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? లడ్డూను ఎలా తయారు చేస్తారు? తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర మాత్రం బాహుబలి క్రేన్‌లో సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. సమస్యను పరిష్కరించిన అనంతరం మహాగణపతిని టస్కర్‌పైకి చేర్చి శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.
గణేశ్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సెప్టెంబర్ 25న సెలవు ప్రకటించింది. ఈ మేరకు జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14ను పనిదినంగా నిర్ణయించింది.
హైదరాబాద్‌లో ఈ నెల 25న జరగనున్న గణేశ్ నిమజ్జనాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 25, 26 తేదీల్లో రాత్రివేళ అదనపు ఎంఎంటీఎస్ రైళ్లను నడపనుంది.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవానికి ఈసారి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనల నేపథ్యంలో ట్యాంక్ బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని అధికారులు నిషేధించారు. భక్తుల కోసం నగరవ్యాప్తంగా ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలు, కృత్రిమ చెరువులు, ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేస్తున్నారు.
వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ మండపాలకు జియో ట్యాగింగ్, ప్రధాన నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక, సోషల్ మీడియాలో వదంతులపై 24 గంటల నిఘా వంటి చర్యలకు సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.