ఓట్ల తొలగింపుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. హైదరాబాద్ తగలబడుతుందంటూ హెచ్చరిక

హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హిమాయత్‌నగర్ డివిజన్‌లో సుమారు 20 వేల ఓట్లు తొలగించారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం వైఖరి మార్చుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని, హైదరాబాద్‌లో పరిస్థితులు సాధారణంగా ఉండవని ఆయన హెచ్చరించారు.

1 అక్టోబర్, 2026 2:35 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఓట్ల తొలగింపుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. హైదరాబాద్ తగలబడుతుందంటూ హెచ్చరిక

హైదరాబాద్, అక్టోబర్ 1 (జనవాణి): ఓట్ల తొలగింపు వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో స్పందించారు. హిమాయత్‌నగర్ డివిజన్‌లో సుమారు 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపించిన ఆయన వెంటనే వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓట్లు తొలగించిన తర్వాత ఎన్నికలకు వెళ్లడం దురదృష్టకరమన్నారు.

గురువారం మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్ ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తనకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 20 వేల ఓట్లు తొలగించినట్లు తెలిసిందని, ఇంకా ఎన్ని ఓట్లు తొలగించారో తెలియాల్సి ఉందన్నారు.

‘ఓటు చోరీ’ జరుగుతోందని ఆరోపణ

గతంలో ఉన్న జెన్యూన్ ఓటర్ల పేర్లు ప్రస్తుతం తొలగించారని దానం నాగేందర్ ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఓట్ల తొలగింపు వెనుక కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆయన బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీతో కలిసి కొందరు పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు

తొలగించిన ఓట్లను తిరిగి చేర్చకపోతే ఆందోళనలు కొనసాగిస్తామని దానం నాగేందర్ హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ తన వైఖరిని మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని, హైదరాబాద్‌లో సాధారణ పరిస్థితులు ఉండవని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

ఏఆర్వో, ఏఎంసీ అనుమతులపై ప్రశ్నలు

ఆన్‌లైన్‌లో ఓటు తొలగింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానికంగా ఉన్న అధికారుల నియంత్రణ ఉండటం లేదని దానం నాగేందర్ ఆరోపించారు. ఏఆర్వో, ఏఎంసీ ఆమోదం లేకుండానే ఓట్లు డిలీట్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ఏఆర్వోలు, ఏఎంసీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు