మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్.. ముఖ్యమంత్రి రేవంత్ పై ఫైర్

నర్సంపేటలో ప్రెస్‌మీట్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ నుంచి విడుదలైన ఆయన.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

19 ఆగస్టు, 2026 10:34 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్.. ముఖ్యమంత్రి రేవంత్ పై ఫైర్

Janavaani Image

జనగాం, ఆగస్టు 19 (జనవాణి): నర్సంపేటలో నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేటకు వెళ్లకుండా అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం జనగామ పోలీస్ స్టేషన్‌ నుంచి విడుదలైన ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతోందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఏడు సార్లు గెలిచినా తనపై ఎలాంటి మచ్చ లేదని అన్నారు. నర్సంపేటలో కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు కూడా వెళ్లనివ్వకుండా అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. నర్సంపేటలో సంపూర్ణ బంద్ జరిగిందని పేర్కొన్న ఎర్రబెల్లి.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. నర్సంపేటలో పెద్ది ఎమ్మెల్యేగా ఉండి కూడా రూపాయి సంపాదించలేదు. అప్పుల పాలు అయ్యాడు.పెద్ది గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. మెడికల్ కాలేజీ, సాగునీటి వసతులు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి బోగస్ హామీలతో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రైవేట్ స్థలంలోనే ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి, డబ్బుల సంచులు, దౌర్జన్యాలను అరికట్టాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖను అడ్డుపెట్టుకుని పేదల భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు అధికారులు సహకరించవద్దని సూచించారు. రాబోయే రెండేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా న్యాయం కోసం పనిచేయాలని కోరారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు