#Narsampet

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Narsampet.

14 Stories

Stories tagged with #Narsampet

Janavaani Image
news,politics,telangana

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్.. ముఖ్యమంత్రి రేవంత్ పై ఫైర్

నర్సంపేటలో ప్రెస్‌మీట్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ నుంచి విడుదలైన ఆయన.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

19 ఆగ, 20261 min read
అర్ధరాత్రి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత?.. నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత
telangana,news

అర్ధరాత్రి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత?.. నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత

అర్ధరాత్రి 3 గంటలకు విగ్రహం తొలగింపు.. నర్సంపేటలో హైటెన్షన్ 1,500 మంది పోలీసుల బందోబస్తు.. కార్యకర్తల అరెస్టులు.. ఆ తర్వాత విగ్రహం తొలగింపు? నర్సంపేటలో ఏం జరిగింది?

18 ఆగ, 20262 min read
నర్సంపేటలో పెద్ది విగ్రహంపై హైడ్రామా.. రాత్రంతా పోలీస్ పహారా
telangana,news,district

నర్సంపేటలో పెద్ది విగ్రహంపై హైడ్రామా.. రాత్రంతా పోలీస్ పహారా

వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం చుట్టూ ఉద్రిక్తత కొనసాగుతోంది. గద్దె కూల్చివేత తర్వాత బీఆర్ఎస్ నేతలు మళ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, తొలగించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం వద్ద రాత్రంతా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.

11 ఆగ, 20262 min read
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
telangana,news

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అదే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

10 ఆగ, 20262 min read
పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల సాయం.. రేపు నర్సంపేటకు కేసీఆర్‌
news,telangana

పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల సాయం.. రేపు నర్సంపేటకు కేసీఆర్‌

దివంగత బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. ఇందులో పెద్ది ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు.

8 ఆగ, 20261 min read
పోలీసు లాంఛనాలతో పెద్ది సుదర్శన్‌రెడ్డి అంత్యక్రియలు .. సీఎం రేవంత్ ఆదేశాలు
news,telangana

పోలీసు లాంఛనాలతో పెద్ది సుదర్శన్‌రెడ్డి అంత్యక్రియలు .. సీఎం రేవంత్ ఆదేశాలు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా వరంగల్ జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

31 జులై, 20261 min read
Google Image
district,news,politics,special-stories

తెలంగాణ వచ్చే వరకు పెళ్లి చేసుకోనని శపథం.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితంలో ఆ అరుదైన కథ!

తెలంగాణ ఉద్యమం కోసం ఏకంగా పెళ్లినే త్యాగం చేసిన నాయకుడు... స్వరాష్ట్రం వచ్చేవరకు బ్రహ్మచర్యం పాటిస్తానని శపథం చేసిన వ్యక్తి... ఉద్యమం గెలిచిన తర్వాతే తిరుమలలో వివాహం చేసుకున్న నాయకుడు... అలాంటి బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. ఆయన మరణంతో తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎవరు? తెలంగాణ కోసం ఎందుకు అలాంటి శపథం చేశారు? ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

31 జులై, 20262 min read
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సంతాపం
news,telangana

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సంతాపం

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

31 జులై, 20261 min read
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం
news,telangana

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ సంతాపం తెలిపారు.

31 జులై, 20262 min read
ఐదు రోజులు ప్రాణాలతో పోరాడి.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
news,telangana

ఐదు రోజులు ప్రాణాలతో పోరాడి.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

బీఆర్ఎస్ నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం అర్ధరాత్రి 12.50గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

31 జులై, 20261 min read
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
telangana,health

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇటీవల గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని కలిసి పరామర్శించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం వారి కుటుంబ సభ్యులకు కలిసి ధైర్యం చెప్పడం జరిగింది.

28 జులై, 20261 min read
"మీరు ఏం చేస్తారో చేయండి... కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి".. వైద్యులతో కేసీఆర్
news,telangana

"మీరు ఏం చేస్తారో చేయండి... కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి".. వైద్యులతో కేసీఆర్

తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

27 జులై, 20262 min read
యశోద ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ అధినేత
telangana,news

యశోద ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ అధినేత

తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కేసీఆర్, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

27 జులై, 20261 min read
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు
news,telangana

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

26 జులై, 20261 min read