వరంగల్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు హుటాహుటిన వరంగల్‌కు బయల్దేరి వెళ్లారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, బీఆర్ఎస్‌లో కీలక నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.




















