హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతం..పోలీసులతో కలిసి సంబరాలు చేసుకున్న సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో రెండు రోజులుగా కొనసాగిన గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శోభాయాత్ర విజయవంతంగా పూర్తవడంతో పోలీసులు, అధికారులు సంబరాలు చేసుకున్నారు.

26 సెప్టెంబర్, 2026 5:36 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతం..పోలీసులతో కలిసి సంబరాలు చేసుకున్న సీపీ సజ్జనార్

హైదరాబాద్,సెప్టెంబర్ 26 (జనవాణి): హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. పదకొండు రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణపతులను రెండు రోజుల పాటు నగరంలోని వివిధ నిమజ్జన కేంద్రాలకు తరలించారు. భారీగా భక్తులు తరలివచ్చినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన ప్రక్రియ విజయవంతంగా పూర్తవడంతో పోలీసులు, అధికారులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌ కింద పోలీసు సిబ్బందితో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీ సజ్జనార్.. నగరంలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో గణేశ్ శోభాయాత్రలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హోంగార్డుల నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్కరి కృషిని అభినందించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధిక సంఖ్యలో నిమజ్జనాలు జరిగినట్లు సీపీ వెల్లడించారు. బందోబస్తు కోసం ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసు సిబ్బందిని నగరానికి రప్పించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు.

sajjanar cp pressmeet

ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్, బాలాపూర్ గణపతుల నిమజ్జనాలను నిర్ణీత సమయానికి పూర్తి చేశామని సజ్జనార్ తెలిపారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన భాగ్యనగర్ ఉత్సవ సమితి, భక్తులు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణపతులను కలిపి సుమారు 45 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. భారీ జనసందోహం మధ్యనూ శోభాయాత్రలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు