ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్న హైడ్రా

ఉప్పల్ నల్లచెరువు జలకళ సంతరించుకోవడానికి తాము తీసుకున్న చర్యలే కారణమని హైడ్రా వెల్లడించింది. భారీ మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిండి మురికి కూపంగా మారిన ఈ చెరువును ఇటీవల పునరుద్ధరించామని.. దానివల్లే ఇటీవల కురిసిన వర్షాలకు ఉప్పల్ నల్లచెరువు వరద నీటితో నిండిందని పేర్కొంది.

1 ఆగస్టు, 2026 7:01 PM•ByRalin

Share this article

ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్న హైడ్రా

ఉప్పల్ నల్లచెరువు జలకళ సంతరించుకోవడానికి తాము తీసుకున్న చర్యలే కారణమని హైడ్రా వెల్లడించింది. భారీ మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిండి మురికి కూపంగా మారిన ఈ చెరువును ఇటీవల పునరుద్ధరించామని.. దానివల్లే ఇటీవల కురిసిన వర్షాలకు ఉప్పల్ నల్లచెరువు వరద నీటితో నిండిందని పేర్కొంది. ఈ మేరకు ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు చేసింది.

వర్షాలు పడినప్పుడు వరద నీరు చెరువులోకి చేరేలా.. మురుగునీరు ప్రత్యేక బైపాస్ కాలువ ద్వారా బయటకు వెళ్లేలా కాలువలను అభివృద్ధి చేసినట్లు హైడ్రా తెలిపింది. దీంతో ఎగువ ప్రాంతాల్లో నీరు నిల్వ కాకుండా వరద ప్రవాహం సాఫీగా నల్లచెరువుకు చేరిందని వెల్లడించింది. ఉప్పల్ నల్లచెరువులో 10 ఎకరాలకు పైగా ఆక్రమణలను తొలగించి, చెరువు విస్తీర్ణాన్ని 70 ఎకరాల వరకు పెంచినట్లు హైడ్రా పేర్కొంది. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది.

చెరువుకు ఎగువన ఉన్న నాచారం చెరువు, పరిసర ప్రాంతాల నుంచి వరద నీరు చేరేలా రెండు ఇన్లెట్లను, చెరువు నిండిన తర్వాత అదనపు నీరు మూసీ నదిలోకి వెళ్లేలా ఔట్లెట్‌ను అభివృద్ధి చేసినట్లు వివరించింది. అంతేకాకుండా, ఉప్పల్ నల్లచెరువును కేవలం నీటి నిల్వ కేంద్రంగా కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన విహార ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నట్లు హైడ్రా వెల్లడించింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, మెయిన్ బండ్, చిన్నారుల కోసం ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

హైడ్రా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న ప్రధాన చెరువుల్లో ఉప్పల్ నల్లచెరువు ఒకటని, ఇప్పటికే మూడు చెరువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, త్వరలో ఉప్పల్ నల్లచెరువును కూడా నగరానికి మరో అందమైన జలవనరుగా అందిస్తామని హైడ్రా వెల్లడించింది.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు