శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తల్లి శ్రీమతి రుక్కమ్మ ఇటీవల పరమపదించిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సోమవారం వారి నివాసానికి వెళ్లి మహేందర్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా దివంగత రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహేందర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ, దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.




















