నా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోను.. కొండా సురేఖ హెచ్చరిక

మంత్రి పదవి కోల్పోవడంపై తనకు ఎలాంటి బాధ లేదని వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. మంత్రిగా ఉంటే రాష్ట్రస్థాయిలో సేవ చేసే అవకాశం ఉండేదని, ప్రస్తుతం వరంగల్ నియోజకవర్గంపై మరింత దృష్టి పెట్టి అభివృద్ధి చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. తమ అనుచరుల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

29 సెప్టెంబర్, 2026 3:17 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోను.. కొండా సురేఖ హెచ్చరిక

వరంగల్,సెప్టెంబర్ 29 (జనవాణి): మంత్రి పదవి పోయిందని తనకు బాధగా లేదని వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. మంత్రిగా కొనసాగితే రాష్ట్రస్థాయిలో సేవ చేసే అవకాశం ఉండేదని, అయితే ప్రస్తుతం తన నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని తెలిపారు.

వరంగల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. ఇకపై నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

వచ్చే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడమే తమ లక్ష్యం అని కొండా సురేఖ తెలిపారు. తమ అనుచరులపై ఎలాంటి దాడులు జరిగినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇటీవల ఎంజీఎం ఆస్పత్రి వద్ద బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆమె విమర్శించారు.

వరంగల్ అభివృద్ధిపై బీజేపీకి సవాల్

కొత్త కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు చేపట్టిన నిరసనపై కూడా కొండా సురేఖ స్పందించారు. వరంగల్ అభివృద్ధిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరంగల్‌లోని పురాతన ప్రదేశాలను అభివృద్ధి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి వరంగల్ అభివృద్ధికి సహకరించిన తర్వాతే బీజేపీ నేతలు మాట్లాడాలని ఆమె సవాల్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇకపై మరింత సమయం కేటాయిస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు