వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనను, తన అనుచరులను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడే నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. లేదంటే మహిళా కార్యకర్తలతో గట్టిగా సమాధానం చెప్పిస్తామని వ్యాఖ్యానించారు.
మంత్రి పదవి కోల్పోవడంపై తనకు ఎలాంటి బాధ లేదని వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. మంత్రిగా ఉంటే రాష్ట్రస్థాయిలో సేవ చేసే అవకాశం ఉండేదని, ప్రస్తుతం వరంగల్ నియోజకవర్గంపై మరింత దృష్టి పెట్టి అభివృద్ధి చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. తమ అనుచరుల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య, మంత్రి కొండా సురేఖకు ఢిల్లీ నుంచి పలువురు ఫోన్లు చేసినా ఆమె వెళ్లలేదని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు సేవ చేయాలన్న మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కొండా దంపతుల లక్ష్యమని పేర్కొన్నారు.
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఢిల్లీ పిలుపు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వెంటనే ఢిల్లీకి రావాలని పార్టీ పెద్దలు సందేశం పంపినట్లు సమాచారం. మరోవైపు ఆమెకు కేబినెట్ స్థాయి పదవి ఇచ్చే అంశంపై అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్న వేళ ఎమ్మెల్సీ విజయశాంతి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కొండా సురేఖ స్థానంలో బీసీ మహిళా నేతగా విజయశాంతికి అవకాశం దక్కే అవకాశముందనే ప్రచారం సాగుతోంది.
రాహుల్ గాంధీ ‘పితృస్వామ్యాన్ని అంతం చేయాలి’ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు డొల్ల మాటలేనని బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సారయ్య.. ధైర్యముంటే ఇద్దరం ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామని సురేఖకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఎన్నికల్లో తలపడదామని సవాల్ విసిరారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక కీలక రాజకీయ నిర్ణయం తీసుకుంటారా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ‘వైట్ కాలర్ క్రిమినల్’, రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్న వ్యక్తిగా ఆరోపించిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘సర్కస్ కంపెనీ’లా మారిపోయిందని విమర్శించారు.
తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం మరింత ముదురుతోంది. తనను మంత్రి పదవి నుంచి తొలగించకముందే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సురేఖ రాసిన 10 పేజీల లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తనను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కారని, తన శాఖల్లో తనకు తెలియకుండానే కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆమె ఆరోపించినట్లు లేఖలోని అంశాలు వెల్లడిస్తున్నాయి.
మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తనను బర్తరఫ్ చేయాలనే ఆలోచన కాంగ్రెస్ అధిష్ఠానానికి లేదని, సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడి తనపై చర్యలు తీసుకునేలా చేశారని ఆరోపించారు. తన వివరణ తీసుకోకుండా, తనతో మాట్లాడకుండా మంత్రి పదవి నుంచి తొలగించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి పై వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కొండా సురేఖ తన పార్టీలో చేరాలని, బీసీ మహిళగా ఆమెను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్‌లో బీసీ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ సిఫారసు లేఖను గవర్నర్‌కు పంపించారు. రాజీనామాకు సురేఖ అంగీకరించకపోవడంతో బర్తరఫ్ ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పలు కీలక పదవుల్లో మార్పులు చేసింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే బర్తరఫ్‌కు సిఫార్సు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో కొండా సురేఖ తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులు, నేతలపై ఆరోపణలు ఉన్నాయని, వారికి ఒక న్యాయం.. తనకు మరో న్యాయం ఎందుకని సురేఖ ప్రశ్నించారు.
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీపరంగా వివాదం ముదిరిన వేళ.. కొండా సురేఖ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధిష్టానం నుంచి వచ్చిన పిలుపుతోనే ఆమె ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పరకాల నియోజకవర్గం వ్యవహారంపై విభేదాలు, మంత్రి పదవిపై వేటు ప్రచారం కొనసాగుతున్న వేళ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రక్షాబంధన్ సందర్భంగా మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఇరువురి మధ్య రాజకీయ విభేదాలకు తెరపడిందా? అనే చర్చ మొదలైంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం కొనసాగుతున్న వేళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలను తాను గౌరవిస్తానని, వారిపై బహిరంగంగా విమర్శలు చేయడం తన విధానం కాదని స్పష్టం చేశారు. మహిళ కన్నీటి చుక్క సునామీగా మారుతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఈ వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అయితే జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపుల విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో వెనక్కి తగ్గబోనని తేల్చిచెప్పారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఆమె వివరణపై కమిటీ సంతృప్తి చెందలేదని, సురేఖతో పాటు మరో ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ నివేదికను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌కు అందించనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌లో విభేదాలు ముదురుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. కొండా సురేఖపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొండా కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎవరైనా ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కాంగ్రెస్ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొండా కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.
కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుస్మితకు లేదని విమర్శించారు. తల్లిదండ్రుల పేరును దిగజార్చేలా మాట్లాడకుండా రాజకీయాల్లో ఓపిక, బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘాటుగా స్పందించగా.. రేవూరి ప్రకాశ్ రెడ్డి మాత్రం వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పి తన స్థాయిని తగ్గించుకోనని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ రేఖను ఎవరైనా దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. పరకాల నియోజకవర్గంపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తానని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. తనకు కౌంటర్ ఇస్తే ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలను బయటపెడతానని హెచ్చరించారు.
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో.. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ పెట్టిన ‘అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే’ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ తీవ్ర చర్చకు దారితీసింది.
జూలై 16న గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు, ఆగస్టు 13న మహాకుంభహారతితో సంప్రదాయబద్ధంగా ఘనంగా ముగిశాయి. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధల మధ్య ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది.
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారుబోనం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.