కాంగ్రెస్‌ 1000 రోజుల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ ఫైర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి తెలంగాణ భవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ‘ఛార్జ్‌షీట్‌’ను విడుదల చేశారు.

2 సెప్టెంబర్, 2026 2:53 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కాంగ్రెస్‌ 1000 రోజుల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్ 01 (జనవాణి): కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి బుధవారం తెలంగాణ భవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ‘ఛార్జ్‌షీట్‌’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ‘అభయహస్తం’ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం, దగా పత్రంగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రస్తుత పాలనను Gen Z భాషలో చెప్పాలంటే ‘అసమర్థత ప్రోమ్యాక్స్‌, అవినీతి అల్ట్రామ్యాక్స్‌, అరాచకం ఐమ్యాక్స్‌’గా మారిందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్‌ ఆరోపించారు. ఇంత భారీగా అప్పులు చేసినా కొత్తగా ఒక్క ఇటుక పెట్టలేదని, ఒక్క చెక్‌డ్యామ్‌ కూడా నిర్మించలేదని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు రిబ్బన్‌ కటింగ్‌లు చేయడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. మూసారాంబాగ్‌లో బీఆర్‌ఎస్‌ హయాంలో శంకుస్థాపన చేసిన బ్రిడ్జిని సగం పూర్తిచేసి దాని వద్ద ముఖ్యమంత్రి రిబ్బన్‌ కట్‌ చేస్తున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

సీఎం, మంత్రులపై తీవ్ర ఆరోపణలు

తెలంగాణ సంపద కోసం సీఎం, మంత్రులు ఎంగిలి విస్తరాకుల దగ్గర కుక్కలు కొట్టుకున్నట్లు కొట్లాడుకుంటున్నారని కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సంపదను ఢిల్లీకి మూటలు కట్టి పంపిస్తున్నారని ఆరోపించారు. రైతులకు రైతు భరోసా నిధులు ఆపేసి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి కప్పం కడుతున్నారని విమర్శించారు. 1000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం ఏదైనా సందేశం ఇస్తుందని, కార్యక్రమాలు చేపడుతుందని భావించామని.. కానీ సీఎం, మంత్రులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ సంపద దోపిడీకి గురవుతోందని ఆరోపించారు.

శాంతిభద్రతలపై కేటీఆర్‌ ఫైర్‌

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేటీఆర్‌ ఆరోపించారు. మంత్రుల కుమారులు దౌర్జన్యాలకు పాల్పడినా, ఇతర పార్టీల నేతల కుమారులు ప్రమాదాలకు కారణమైనా పోలీసులు కేసులు నమోదు చేయకుండా కాపాడుతున్నారని విమర్శించారు. కంటోన్మెంట్‌లోని సైనిక స్థావరంలోకి చొరబడి తుపాకులు ఎత్తుకెళ్లడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనమని అన్నారు. మహిళలపై హత్యాచారాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నేతల కుమారులపై పోక్సో ఆరోపణలు వచ్చిన సందర్భంలోనూ ప్రభుత్వం నిందితులకు సహకరించిందని కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ పరిస్థితి దారుణంగా మారిందని విమర్శించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు