బోండీ బీచ్ ఘటనలో 20 మందికి కాపాడిన హైదరాబాద్ హీరో.. రహ్మత్ పాషాను సన్మానించిన కేటీఆర్

ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ ప్రాంతంలో గతేడాది డిసెంబర్‌లో జరిగిన కాల్పుల సమయంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి 20 మంది ప్రాణాలను కాపాడిన హైదరాబాద్‌కు చెందిన రెహ్మత్ పాషాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.

4 ఆగస్టు, 2026 5:01 PM•ByRalin

Share this article

బోండీ బీచ్ ఘటనలో 20 మందికి కాపాడిన హైదరాబాద్ హీరో.. రహ్మత్ పాషాను సన్మానించిన కేటీఆర్

రహ్మత్ పాషాతో కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 4: ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ ప్రాంతంలో గతేడాది డిసెంబర్‌లో జరిగిన కాల్పుల సమయంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి 20 మంది ప్రాణాలను కాపాడిన హైదరాబాద్‌కు చెందిన రెహ్మత్ పాషాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. క్యాబ్ డ్రైవర్ అయిన రెహ్మత్ పాషా తెగువకు మెచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం గతేడాది శాశ్వత నివాస హోదాను కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణమని అన్నారు.ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి ఖ్యాతిని మరింత పెంచేలా రహ్మత్ పాషా చేసిన సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అన్నారు. మానవత్వం, సేవాభావం, ధైర్యసాహసాలకు ఆయన నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నిశీధర్ బొర్రా, వేణు తదితరులు పాల్గొని రహ్మత్ పాషాను ఘనంగా అభినందించారు. తెలుగు సమాజానికి ఆయన గర్వకారణమని, సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేసే ప్రతి ఒక్కరికీ ఆయన ఆదర్శంగా నిలుస్తారని నాయకులు పేర్కొన్నారు.

ప్రాణాలకు తెగించి సాయం

గత ఏడాది డిసెంబర్‌లో బోండీ బీచ్‌లో పర్యాటకులు సందడి చేస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారిగా కాల్పులు ప్రారంభం కావడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అదే సమయంలో అక్కడే ఉన్న రహ్మత్ పాషా సురక్షిత ప్రాంతానికి వెళ్లకుండా, తూటాలను తప్పించుకుంటూ రక్తపుమడుగులో పడి ఉన్న గాయపడిన వారిని వరుసగా అంబులెన్స్‌ల వద్దకు తరలించారు. ఆయన ధైర్యసాహసాల వల్ల దాదాపు 20 మంది ప్రాణాలు దక్కినట్లు అధికారులు గుర్తించారు. రహ్మత్ పాషా సేవలను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు పర్మినెంట్ రెసిడెన్సీ మంజూరు చేసింది. దీంతో ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఆస్ట్రేలియాలో స్థిరపడే అవకాశం లభించింది. అలాగే ఆయన పేరును పలు సాహస పురస్కారాలకు నామినేట్ చేయగా, ఘటన సమయంలో ధరించిన టోపీని సిడ్నీ మ్యూజియంలో ప్రదర్శించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆయన పనిచేసిన రైడ్ షేరింగ్ సంస్థ కూడా ప్రత్యేకంగా సన్మానించింది.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు