‘ఫేక్ గాంధీ’.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదవడంపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించిన ఆయన.. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్‌ నేతల అవినీతిని బట్టబయలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

6 అక్టోబర్, 2026 11:47 AM•ByNarender Kumar Nangunoori

Share this article

‘ఫేక్ గాంధీ’.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, అక్టోబర్ 6 (జనవాణి): బీఆర్ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌పై తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే క్రిశాంక్‌పై కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.

“పరిమితి లేని ఏటీఎంలా మారిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అవినీతి సామ్రాజ్యాన్ని మీరు(మ‌న్నె క్రిశాంక్) ప్రశ్నిస్తున్నారు. 420 హామీల ఫేక్‌ గాంధీ కచ్చితంగా కేసులు పెడతారు” అంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రిశాంక్‌పై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. “మిస్టర్‌ ఫేక్‌ గాంధీ.. మీకు నచ్చినన్ని కేసులు పెట్టుకోండి. కాంగ్రెస్‌ నేతల అవినీతిని బట్టబయలు చేస్తూనే ఉంటాం. ఇది నా ప్రామీస్‌” అని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సంబంధించిన మరిన్ని అవినీతి, అక్రమ వ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు. క్రిశాంక్‌పై ఎఫ్‌ఐఆర్‌ అంశం నేపథ్యంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు