మొక్కలు నాటి.. భవిష్యత్ తరాలకు పచ్చని వరం అందిద్దాం: మంత్రి పొన్నం

ప్రకృతి సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని వరం అందించవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

7 ఆగస్టు, 2026 12:08 PM•ByRalin

Share this article

మొక్కలు నాటి.. భవిష్యత్ తరాలకు పచ్చని వరం అందిద్దాం: మంత్రి పొన్నం

హుస్నాబాద్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో మొక్క నాటుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ఆగస్టు 7 (జనవాణి): ప్రకృతి సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని వరం అందించవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వనమహోత్సవం సందర్భంగా గురువారం హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న ప్రకృతి విపత్తులు, అధిక వర్షాలు, కరువు పరిస్థితులకు పర్యావరణ అసమతుల్యత కూడా ఒక కారణమని అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ఒకరోజు కార్యక్రమం కాదని, అది సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కోట్లాది మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. హుస్నాబాద్‌లో మొక్కల పెంపకంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

చేనేత వస్త్రాలనే వినియోగించాలి

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మార్కండేయ ఆలయంలో చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో సింథటిక్ శాలువాలకు బదులుగా నేతన్నలు తయారు చేసిన చేనేత వస్త్రాలను ఉపయోగించాలని సూచించారు. చేనేత వస్త్రాల వినియోగం ద్వారా నేతన్నలతో పాటు పత్తి రైతులకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.

డిగ్రీ కళాశాలకు మరిన్ని వసతులు

హుస్నాబాద్ డిగ్రీ కళాశాలకు గతంలో రహదారి లేకపోయినా ప్రస్తుతం సీసీ రోడ్డు నిర్మించినట్లు మంత్రి గుర్తుచేశారు. కళాశాలకు కాంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ తదితర మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు