కేటీఆర్‌ జల ఉద్యమం చేస్తామంటే.. బీఆర్‌ఎస్‌కు ప్రజలు జల సమాధి చేశారు: ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్‌ జల ఉద్యమం చేస్తామని చెప్పడం విడ్డూరమని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు జల సమాధి చేశారని విమర్శించారు.

9 ఆగస్టు, 2026 4:03 PM•ByRalin

Share this article

కేటీఆర్‌ జల ఉద్యమం చేస్తామంటే.. బీఆర్‌ఎస్‌కు ప్రజలు జల సమాధి చేశారు: ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ఆగస్టు 9 (జనవాణి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జల ఉద్యమం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు ఇప్పటికే జల సమాధి చేశారని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని విమర్శించారు.

జీఆర్‌ఎంబీ సమావేశాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ సమావేశానికి వెళ్లి ఏపీ ప్రతిపాదనలను వ్యతిరేకించాలా? వద్దా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా నదిలో తెలంగాణకు 299 టీఎంసీల వాటాను అంగీకరించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కాదా? అని నిలదీశారు.

గతంలో కేసీఆర్‌ రాయలసీమకు వెళ్లి అక్కడి నేతలతో కలిసి చేసిన వ్యాఖ్యలను చామల ప్రస్తావించారు. జగన్‌ను ప్రజాభవన్‌కు పిలిచి బిర్యానీ పెట్టి గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని కేసీఆర్‌ చెప్పలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు జల ఉద్యమం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి చంద్రబాబుతో అవగాహన ఉందంటూ బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారం తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకేనని చామల విమర్శించారు. రాష్ట్రానికి ఆదాయం తీసుకురావాలనే నిర్ణయంలో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి హిల్ట్‌ పాలసీ తీసుకొచ్చారని తెలిపారు.

కేటీఆర్‌ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై రాజకీయ విమర్శలు చేస్తున్నారని అన్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా కేటీఆర్‌ తనకు సన్నిహితమైన రియల్‌ ఎస్టేట్‌ వర్గాలతో కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రం అప్పులపాలు: చామల

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉందని, బీఆర్‌ఎస్‌ మాత్రం కొత్తగా ఏర్పడిన పార్టీ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు, కలెక్షన్ల కోసమే కేసీఆర్‌ పార్టీ పెట్టారంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆ పార్టీ ఏర్పడలేదని ఆరోపించారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చామల తెలిపారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ చేతిలో పెడితే అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. కేటీఆర్‌ ఇకనైనా నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు