ఈ గ్రామంలో ఎక్కడ తవ్వినా పురాతన విగ్రహాలే.. ఆధ్యాత్మికతకు నిలయంగా మారిన ముదిమాణిక్యం!

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామ శివారులో పురాతన విగ్రహాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు నెలల్లోనే 12 విగ్రహాలు బయటపడగా, వాటిలో ఎక్కువగా అమ్మవారి విగ్రహాలే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. విగ్రహాలు చెక్కుచెదరకుండా ఉండటంతో వాటికి స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉన్నట్లు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

1 సెప్టెంబర్, 2026 1:07 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఈ గ్రామంలో ఎక్కడ తవ్వినా పురాతన విగ్రహాలే.. ఆధ్యాత్మికతకు నిలయంగా మారిన ముదిమాణిక్యం!

కరీంనగర్, సెప్టెంబర్ 01 (జనవాణి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామం ప్రస్తుతం పురాతన విగ్రహాల వెలికితీతతో వార్తల్లో నిలుస్తోంది. గ్రామ శివారులోని బండల ప్రాంతంలో ఎక్కడ తవ్వకాలు చేపట్టినా ఏదో ఒక పురాతన ఆనవాలు బయటపడుతోందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా గత ఆరు నెలల్లోనే 12 విగ్రహాలు వెలుగులోకి రావడం ఆసక్తిని కలిగిస్తోంది.

ఎక్కువగా అమ్మవారి విగ్రహాలే..

ఇటీవల గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన తవ్వకాల సమయంలో తొలిసారిగా ఓ అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ తర్వాత మరికొన్ని విగ్రహాలు కూడా వరుసగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు లభించిన విగ్రహాలన్నీ దాదాపు చెక్కుచెదరకుండా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారి విగ్రహాలతో పాటు కాలభైరవుడు, దత్తాత్రేయుడు, వీరభద్రుడు, మానసదేవి అమ్మవారి విగ్రహాలు, ఆలయ ఆనవాళ్లు కూడా ఇక్కడ ఇప్పటికే బయటపడ్డాయి. విగ్రహాలను స్థానిక రైతులు బండల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

కాకతీయుల కాలం నాటి ఆనవాళ్లు?

ముదిమాణిక్యం శివారులో బండలు పరుపులా విస్తరించి ఉండగా.. వాటి పక్కనే ఓ వాగు, మూడు చెరువులు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. అయితే ప్రకృతి అందాలతో పాటు చారిత్రక ప్రాధాన్యత కూడా ఈ ప్రాంతానికి ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కాకతీయులు పాలన సాగించినట్లు ఆధారాలు ఉన్నాయని, వందల ఏళ్ల క్రితమే ఇక్కడ పురాతన ఆలయాలు ఉండి ఉండొచ్చని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా శైవ క్షేత్రాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

GOd

భక్తుల తాకిడి పెరుగుతోంది

ఇప్పటికే ఈ ప్రాంతంలో మరో పెద్ద బండ సమీపంలో శివాలయం ఉంది. ఆలయ పరిసరాల్లో కూడా పురాతన ఆనవాళ్లు బయటపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వరుసగా విగ్రహాలు వెలుగులోకి రావడంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివస్తున్నారు. ఇక్కడ ఇంకా తవ్వకాలు చేపడితే మరిన్ని పురాతన విగ్రహాలు, ఆలయ నిర్మాణాలకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని వారు కోరుతున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు